Friday, November 22, 2024
HomeతెలంగాణWarangal: హైదరాబాద్ కు నాలుగు దిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

Warangal: హైదరాబాద్ కు నాలుగు దిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

హైదారాబాద్ నగరంకు నాలుగు దిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు ఏర్పాటు అవుతున్నాయని..జిల్లాకో మెడికల్ కాలేజీని తాము ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనంతగా వైద్య, ఆరోగ్య శాఖకు భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగాయని.. వరంగల్ లో ఐటీ, టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు అవుతున్నాయన్నారు. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి జరుగుతున్న వరంగల్ ను హెల్త్ సిటీ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

- Advertisement -

వరంగల్ ఆరేపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన NSR మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా zp మాజీ ఛైర్మన్ సాంబారి సమ్మారావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News