Saturday, November 23, 2024
HomeతెలంగాణWarangal: తొర్రూరు నుండి హైద‌రాబాద్ కు సూప‌ర్ ల‌గ్జ‌రీ బస్సులు

Warangal: తొర్రూరు నుండి హైద‌రాబాద్ కు సూప‌ర్ ల‌గ్జ‌రీ బస్సులు

ఉమ్మ‌డి పాల‌న‌లో కుంటుప‌డిన ఆర్టీసిని ఓ గాడిలో పెట్టి, పూర్వ వైభ‌వం తెచ్చిన ఘ‌న‌త సీఎం కెసిఆర్ కే ద‌క్కుతుంద‌ని, ఇక ఆర్టీసిని కాపాడుకునే బాధ్య‌త ఆర్టీసి కార్మ‌కులు, ప్ర‌యాణీకుల‌దేన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. తొర్రూరు నుంచి వ‌యా తిరుమ‌ల‌గిరి, మోత్కూరుల మీదుగా ఉప్ప‌ల్ వ‌ర‌కు న‌డిచే రెండు సూప‌ర్ ల‌గ్జ‌రీ బస్సుల‌ను మంత్రి తొర్రూరులో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, ఉమ్మ‌డి పాల‌న‌లో ఆర్టీసి ఆగ‌మైంద‌న్నారు. ఆంధ్రాప్రాంతం నుండి న‌డిచే ప్రైవేట్ బ‌స్సుల కోసమేగాక‌, తెలంగాణ‌పై వివ‌క్ష‌తో ఆర్టీసిని అన్యాయం చేశార‌న్నారు. కార్మికుల‌ను ఇబ్బందులుకు గురి చేశార‌న్నారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత సిఎం కెసిఆర్ ఆర్టీసికి పూర్వ వైభ‌వం తెచ్చార‌న్నారు. ఆర్టీసిని అన్ని విధాలుగా ఆదుకున్నారు. కార్మికుల‌కు కావాల్సిన విధంగా సాయం అందించారు. ఇక ఇప్పుడు ఆర్టీసిని కాపాడుకునే బాధ్య‌త కార్మికులు, ప్ర‌యాణీకుల‌దేన‌ని మంత్రి అన్నారు.

- Advertisement -

తొర్రూరు బ‌స్సు డిపోను ఆధునీక‌రించేందుకు కృషి చేస్తామ‌న్నారు. ప్లాట్ ఫారాలు, ఫ్లోరింగ్ వంటివి చేప‌డ‌తామ‌న్నారు. అయితే, బ‌స్ స్టాండ్ ప్రాంతాన్ని ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని ఆదేశించారు. ప్ర‌యాణీకులు కూడా ఆర్టీసి ప్రాంగ‌ణాన్ని త‌మ సొంత ఇంటిలా చూసుకోవాల‌ని సూచించారు. కాగా, ఆర్టీసి సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సులు ప్ర‌తి రోజూ ఉద‌యం 4.20కి, ఉద‌యం 500 గంట‌ల‌కు ఒక్కో బ‌స్సు చొప్పున రోజుకు రెండు ట్రిప్పులు ఈ బ‌స్సులు న‌డుస్తాయ‌ని మంత్రి తెలిపారు. ఈ స‌దుపాయాన్ని ప్ర‌యాణీకులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ ఎం. జె. శ్రీ‌ల‌త డిప్యూటీ ఆర్ ఎం కృపాక‌ర్ రెడ్డి, డి.ఎం. ప‌రిమ‌ళ‌, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత అధికారులు, ఆర్టీసి డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్లు, కార్మిక సంఘాల నాయ‌కులు, కార్మికులు, ప్ర‌యాణీకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News