మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కాలేజీ(VBIT) విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ వార్డెన్ అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీస్తోందని ఆరోపించారు. వార్డెన్ వీడియోలను చిత్రీకరించడం గమనించిన కొందరు విద్యార్థినులు ఫోన్ లాక్కొని పరిశీలించారు. ఆ ఫోన్‌లో మరిన్ని వీడియోలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ వీడియోలను ఆమె ఇతర వార్డెన్స్‌కు పంపించిందనే విషయాన్ని గుర్తించారు. విద్యార్థినులను అసభ్యకరంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.