కొత్తూర్ మండలం సిద్దాపుర్ గ్రామానికి చెందిన మత్యకారుల సంఘం ప్రెసిడెంట్ భైరమోని నరసింహ మరియు గుండె మోని నరసింహ,గుండె మోని లింగయ్య ,ఏషమోని శివకుమార్ ,వడ్డే శివకుమార్ మరియు తదితరులు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.