Rains in telangana: హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం వేళల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఈరోజు పెద్దగా భారీ వర్షాలు కురిసే సూచనలు లేవని స్పష్టం చేశారు.
గణేష్ చతుర్థికి భారీ వర్షాల హెచ్చరిక:
వినాయక చవితి పండుగకు వర్షాలు ఆటంకం కలిగించవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 26 నుండి 29 వరకు, ముఖ్యంగా 27 మరియు 28 తేదీలలో ఉత్తర, తూర్పు మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోనూ వర్షాలు:
హైదరాబాద్ నగరంలో కూడా గణేష్ చతుర్థి సందర్భంగా వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 26 మరియు 29 తేదీల్లో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉండగా, 27 మరియు 28 తేదీలలో మోస్తారు నుండి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పండుగ ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


