రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ సార థ్యంలో మానకొండూరు నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాళ్ళో భాగంగా నిర్వహించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల సంబురాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, బీ.ఆర్.ఎస్. పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీవి.రామకృష్ణా రావులు హాజరయ్యారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఆనందోత్సాలతో జరుపుకుంటూ, ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో పాటు మహిళా ప్రజాప్రతి నిధులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన గీతాలు ప్రజలను విశేషంగా అలరించగా, ఆడబి డ్డలు బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విజయ, రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ లు, జడ్పీటీసీలు, సర్పంచులు, మహిళా మూర్తులు, ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్. పార్టీ శ్రేణులు,అన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు, తదిత రులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.