Tuesday, January 7, 2025
HomeతెలంగాణKavitha: శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కవిత సవాల్

Kavitha: శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కవిత సవాల్

బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో కాంగ్రెస్, బీజేపీ ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం వహించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఆరోపించారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ మహాసభలో ఆమె మాట్లాడుతూ…రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయ‌న్నారు. తాను చెప్పింది అబద్ధం అయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాని సవాల్ చేశారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిర గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ఎన్టీఆర్, కేసీఆర్ వంటి ప్రాంతీయ పార్టీ నేతలే బీసీలకు న్యాయం చేశారని ఆమె గుర్తు చేశారు.

- Advertisement -

ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారని ఇది బీసీలకు కాంగ్రెస్ చేసిన ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ తొక్కి పెట్టిందన్నారు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇక బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టిందన్నారు.

2011 కులగణన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదని విమర్శించారు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదన్నారు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసిందన్నారు. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జరిగిన లాభం ఏమిటో చెప్పాలన్నారు
రాబోయే జనాభా గణనలో కులగణన చేయాలని కవిత డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News