గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మందుబాబులకు పోలీసులు షాకిచ్చారు. రేపు(ఆదివారం) శ్రీరామ నవమి(Srirama Navami) పర్వదినం పురస్కరించుకుని నగరంలోని వైన్ షాపులు(Wine Shops) మూతపడున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. వైన్ షాపులతో పాటు కల్లు కాపౌండ్లు, బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, మిలటరీ క్యాంటీన్లు క్లోజ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. తమ ఆదేశాలను బేఖాతురు చేసి షాపులు తెరిస్తే సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దీంతో మద్యం ప్రియులు ఇవాళ మద్యం కొనుగోలు చేసేందుకు వైన్ షాపుల ఎదుట క్యూ కడుతున్నారు.