Monday, October 28, 2024
HomeతెలంగాణHyderabad: హైదరాబాద్‌లో విషాదం.. చికెన్ మోమోస్ తిని మహిళ మృతి

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. చికెన్ మోమోస్ తిని మహిళ మృతి

Hyderabad| హైదరాబాద్‌ బంజారాహిల్స్ నందినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఏర్పాటుచేసిన ఓ స్టాల్‌లో స్థానికులు మోమోస్(Momos) తిన్నారు. పలువురు ఇష్టంగా చికెన్ మోమోస్ కొనుక్కుని తెగ లాగించేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. తర్వాతే వారి శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంటికి వెళ్లిన తర్వాత మోమోస్ తిన్న వారంతా వాంతులు చేసుకుంటూ విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50 మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

అయితే అస్వస్థతకు గురైన సింగాకుంట బస్తీకి చెందిన రేష్మ అనే మహిళ కూడా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ యువతి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్ట్రీట్ ఫుడ్ తిని అస్వస్థతకు గురి కావడంపై బాధితులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మోమోస్‌ తిన్నవారిలో దాదాపు 10 మంది మైనర్లు ఉన్నట్లు సమాచారం.

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేపట్టారు. మోమోస్ విక్రమయించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మోమోస్ తయారీలో ఏమైనా నాసిరకం పదార్థాలు ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ఇటీవల హైదరబాద్ వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లలో కల్తీ పదార్థాలు తయారుచేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కుళ్లిపోయిన చికెన్, ఇతర ఆహార పదార్ధాలు వాడుతున్నట్లు తేలింది. దీంతో బయట ఫుడ్ తిన్నాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మోమోస్ కూడా కల్తీ కావడంతో బయట ఫుడ్ తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News