Woman strong warning to PAs: ప్రజాప్రతినిధులపై సామాజిక మాధ్యమాల్లో ఓ మహిళ విరుచుకుపడింది. ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఉండే పీఏల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నాయి.
మీ అక్కో, అన్నో ఓట్లు వేస్తేనే గెలిచారా: ఎంపీ, ఎమ్మెల్యేల పీఏలపై ఓ సామాన్య మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరేయ్ పీఏగాళ్లారా.. మీ అక్కో, అన్నో ఓట్లు వేస్తే ప్రజాప్రతినిధులు గెలవలేదురా.. అంటూ తన బాధను వెళ్లగక్కింది. మీరు వేసిన నాలుగు ఓట్లతోనే ఎంపీ, ఎమ్మెల్యేలు విజయం సాధించలేదనే విషయం గుర్తుండి ప్రవర్తించండని హెచ్చరించింది. సామాన్య ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులను కలవడానికి వెళ్లిన ప్రజలను అడ్డకునే పీఏలను నడిరోడ్డుపై బట్టలూడతీసి కొట్టాలని మహిళ అన్నారు.
పర్సనల్ పనుల కోసం గెలిచారా..?: పీఏల కుటుంబ సభ్యుల అపాయింట్మెంట్లు అడగట్లేదని అన్నారు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన నాయకుల అపాయింట్ మెంట్లు మాత్రమే అడిగామని అన్నారు. అయినా ఎందుకు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన వ్యక్తి అపాయింట్మెంట్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నప్పుడు.. అసలు ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నారని విరుచుకుపడ్డారు. పర్సనల్ పనులు చేసుకునేందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారా అని ప్రశ్నించారు. అతి చేసే పీఏలను చెప్పుతో కొట్టాలి అంటూ ఆ మహిళ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుంది. దీంతో నెటిజన్లు సైతం ఆ మహిళకు సపోర్ట్ చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మల వారసురాలు ఇమే అని కామెంట్లు పెడుతున్నారు. ఇలా ప్రశ్నిస్తే గాని.. ప్రజాప్రతినిధులు స్పందించరని అంటున్నారు.


