Saturday, November 2, 2024
HomeతెలంగాణHyderabad: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహం ఏర్పాటు

Hyderabad: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహం ఏర్పాటు

Hyderabad| తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ(Worlds tallest statue of Gandhi) విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈమేరకు సీఎంవో కార్యాలయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే మూసీ, ఈసీ నదుల సంగమం ప్రాంతంలో గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన పూర్తి కాగానే ఈ విగ్రహం నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం.

- Advertisement -

కాగా గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ (KCR) సీఎంగా ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) సర్కార్ తన మార్కు చూపించుకునేలా ఎత్తైన జాతిపిత విగ్రహం కట్టనుంది. ఇప్పటికే రాష్ట్ర సచివాయలం ఎదుట దివంగ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన విషయం విధితమే. అలాగే డిసెంబర్‌లో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News