Tuesday, September 17, 2024
HomeతెలంగాణYadadri: ఘనంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు వేడుకలు

Yadadri: ఘనంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు వేడుకలు

రామన్నపేట మండల కేంద్రంలో నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినం సందర్భంగా సుభాష్ సెంటర్ దగ్గర టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని మరింత ఉన్నత పదవులకు చేరుకోవాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, జడ్పిటిసి పున్న లక్ష్మీ జగన్మోహన్, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల కార్యదర్శి పోషబోయిన మల్లేశం, సర్పంచులు గుప్త నర్సిరెడ్డి అప్పం లక్ష్మీనరసింహ, ఎడ్ల మహేందర్ రెడ్డి, ఉప్పు ప్రకాష్, రేఖ యాదయ్య, కోళ్ల స్వామి, మెట్టు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News