Wednesday, November 6, 2024
HomeతెలంగాణYadadri: సోనియమ్మకు స్వాగతం పలకడం ప్రతి ఒక్కరి బాధ్యత: వీహెచ్

Yadadri: సోనియమ్మకు స్వాగతం పలకడం ప్రతి ఒక్కరి బాధ్యత: వీహెచ్

విజయభేరి సభను విజయవంతం చేద్దాం

గుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విహెచ్ హనుమంతరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 17వ తేదీన జరగబోయే కాంగ్రెస్ విజయభేరి సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను వివరించారు. తెలంగాణ కోసం యావత్ సకల జనుల పోరాటం, విద్యార్థుల ఆత్మబలిదానాలు చూసి చలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అన్నారు. అందుకే ఆ మహానాయకురాలికి స్వాగతం పలకడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు వీహెచ్. విజయ భేరి సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలతో జిల్లా కాంగ్రెస్ నేతలు సమన్వయం చేసుకోవాలన్నారు.

- Advertisement -

సోనియా గాంధీ సెప్టెంబర్ 17వతేదీన మీటింగ్ లో “5 గ్యారెంటీ స్కీమ్””పథకాన్ని ప్రకటిస్తారన్నారు.18న క్యాడర్ అంతా రాష్ట్రంలోని గడప గడపకు వెళ్లి ఈ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో అవినీతికి కేరాఫ్ గా మారిన కేసీఆర్ ను ఓడించి తీరాలన్నారు.తరుచూ తెలంగాణ తెచ్చిన అని చెప్పుకుంటూ కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.ఇచ్చిన మన కాంగ్రెస్ సత్తా ఏందో చూపించాలని తెలిపారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం లోని గ్రామ, గ్రామానికి వెళ్లి ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేద్దామని విహెచ్ హనుమంతరావు అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆలేరు నియోజకవర్గం సభ జనసమికరణ ఇంచార్జ్ పసుపుల ప్రభాకర్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బీర్ల ఐలయ్య,టిపిసిసి సెక్రటరీ జనగామ ఉపేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి,ఈరసారపు గిరి గౌడ్,ఎంపీపీలు చీర శ్రీశైలం,తండా మంగమ్మ శ్రీశైలంలో,కౌన్సిలర్లు మ్యుఖర్ల మల్లేష్,మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గౌడ్,యాసా లక్ష్మరెడ్డి,ఎంపిటిసిలు శ్రీనివాస్ యాదవ్,మోహన్ బాబు,రాంరెడ్డి,సర్పంచ్ జన్నాయికోడ్ నాగేష్,యాదగిరిగుట్ట సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భరత్ గౌడ్,పట్టణ అధ్యక్షుడు బంధరపు బిక్షపతి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News