Thursday, January 22, 2026
HomeతెలంగాణCold Wave: రాష్ట్రంలో ఈ జిల్లాలకు యల్లో అలర్ట్‌.. రెండు రోజుల పాటు తీవ్రమైన చలి.!

Cold Wave: రాష్ట్రంలో ఈ జిల్లాలకు యల్లో అలర్ట్‌.. రెండు రోజుల పాటు తీవ్రమైన చలి.!

Cold Wave Alert in Telangana: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. ఇక ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారత వాతావరణ విభాగం(IMD) యల్లో అలర్ట్‌ జారీ చేసింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/sircilla-weaver-qr-code-shawl-telangana-history-ktr/

తెలంగాణ వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాదిన శీతల గాలుల ప్రభావంతో రాష్ట్రంతో పాటు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలోను తీవ్రమైన చలి ప్రభావం ఉంటుందని ఈ మేరకు IMD వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/10th-class-girl-student-died-of-heart-attack-in-ramachandrapuram/

కాగా, రాష్ట్రంలో డిసెంబర్‌ 14, 15 తేదీల్లో పలు జిల్లాలకు IMD అధికారులు యల్లో అలర్ట్‌ ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లో శీతల గాలులు, పొగ మంచు ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News