తెలంగాణ వ్యాప్తంగారాబోయే నాలుగు రోజులు వర్షాలు(Rains)కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్7 నుంచి జూన్ 11 వరకు నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని అంచాన వేసింది. ఈమేరకు ఎల్లో అలర్ట్(Yellow alert) జారీ చేసింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకంటే తక్కవ నమోదు అయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. దీంతో ఎండవేడిమి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం దొరకనుంది.
ఇక హైదరాబాద్ లో ఈ నాలుగు రోజులు వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. అలాగే నగరంలో జూన్10 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడొచ్చని వెల్లడించింది.
Yellow alert: ఎల్లో అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


