Saturday, November 23, 2024
HomeతెలంగాణYennam: సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా

Yennam: సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా

ఎన్నంకి అపురూప స్వాగతం

ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, పట్టణం అభివృద్ధి కోసం ప్రజలతో మమేకం అయ్యి పని చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని తిమ్మసాని పల్లి, కోయా నగర్ వార్డులలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. పెద్ద ఎత్తున మహిళలు యువత యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు మంగళ హారతులతో వచ్చి తిలకం దిద్ది ఊరేగింపుగా వేదిక వరకు బాజా భజంత్రీలతో బాణాసంచా కాల్చి యెన్నంకి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇంత ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మహిళలకు, యువతకు ధన్యవాదాలు తెలిపారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ నేడు కష్టాలను, బాధలను ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గూడు ఇస్తారని ఆశ పడ్డ అమ్మల, అక్కల ఆశలు అడియాసలైనాయన్నారు.
ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, పేదలకు విద్య వైద్యం ఉచితంగా అందాలన్నా, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలి అన్న కేవలం అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయదు, ప్రజలతో కష్టసుఖాలను పంచుకుంటుంది, యువతకు అవకాశాలు ఇస్తుంది అన్నింటికీ మించి సంక్షేమ పథకాలను మీ గడప గడపకు అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ , కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్, ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఆనంద్ గౌడ్ , మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళ అధ్యక్షురాలు బెక్కరి అనిత , జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు సాయిబాబా, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ లింగం నాయక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు అమర్ , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ , పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు ఆజ్మత్ అలి , కాంగ్రెస్ పార్టీ నాయకులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, అశ్వక్ , రాఘవ , అశోక్ , కిషన్, కృష్ణకుమార్, మైనారిటీ యూత్ అధ్యక్షుడు అవేజ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News