Sunday, October 6, 2024
HomeతెలంగాణYennam Srinivas Reddy: గతాన్ని నెమరు వేసుకోండి

Yennam Srinivas Reddy: గతాన్ని నెమరు వేసుకోండి

మా గెలుపు ఆపడం ఎవరితరం కాదు

రైతుల క్షేమం కోరేది, రైతుకు అండగా ఉండేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఆనాడు వై ఎస్ రాజశేఖరరెడ్డి అయంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని మహబూబ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి హన్వాడ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. బీఆర్ఎస్ నేతలు నేడు ఉచిత విద్యుత్ మీద మాట్లాడితే తాతకు దగ్గులు నేర్పినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నాడు ఎందరో 24 గంటల ఉచిత కరెంట్ మీద హేళన చేసారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ అందించిందని గుర్తు చేశారు. ఏక కాలంలో రు.2 లక్షలు రైతులకు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ కు ఉందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు గతాన్ని నెమరు వేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రతిక్షణం రైతు సంక్షేమం కోసం ఆలోచన చేసిందని, స్వంత ప్రయోజనం కోసం ఏనాడూ పనిచేయలేదని ఆయన అన్నారు. ఇప్పుడు దేవుడు కూడా మన వైపు వచ్చిండు, కాంగ్రెస్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదు అని కార్యకర్తలకు ఉత్సాహం నింపారు.

- Advertisement -

పాలవంటి పాలమూరులో విషపు చుక్కలు రెండు పడ్డాయని ఆ పాలు తాగడానికే కాదు ఏమిటి పనికిరావు అని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుల తీరే కాదు, మాట కూడా కాలుష్యమయమే. ఉత్తి మాటలు చెప్పి ఉన్నవి ఊడుసుకు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఇందిరమ్మ ఎస్టీ లకు రిజర్వేషన్ కల్పించి, ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపింది, చదువుకొనే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు దారి చూపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
పదవులు ఉంటే సరిపోదు సంక్షేమం కోసమే పనిచేయాలని, పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం కోసం పనిచేయాలని, కానీ నేటి బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5000 పాఠశాల లను మూసివేయడం దుర్మార్గం అన్నారు. కేవలం బీ ఆర్ ఎస్ నేతలు అభివృద్ధి చెంది ఇదే అభివృద్ధి అంటే ఏమిటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, కలిగే ఉపయోగాలు వివరించారు. ఆరు గ్యారెంటీలతో అభివృద్ధి సాధ్యం అని, ఇందిరమ్మ రాజ్యం మనం సాధించుకుందాం, అభివృద్ధికి బాటలు వేసుకుందాం అని అన్నారు. అడుగడుగునా ప్రజలు గ్రామాలలో ఆయనకు బ్రహ్మ రథం పట్టారు. బీ ఆర్ ఎస్, బీ జే పి పార్టీ లకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ, టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అమరేంద్ర రాజు , మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగం నాయక్ , హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టంకర కృష్ణయ్య, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వేముల కృష్ణయ్య యాదవ్, హన్వాడ మండల మహిళ అధ్యక్షురాలు శారద , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News