హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ యూనివర్శిటీలో యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ‘మహిళా సాధికారత కోసం యోగా’ అనే థీమ్‌తో గీతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌సిసి క్యాడెట్‌లు, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతదేశంలో పురాతన కాలం నుంచి అనుసరిస్తున్న శారీరక, మానసిక ఆధ్యాత్మిక అభ్యాసాన్ని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాల్లో హైలైట్ చేశారు.
వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ D.S. రావు, హాస్పిటాలిటీ డిప్యూటీ డైరెక్టర్ అంబికా ఫిలిప్ తమ ప్రసంగాల్లో యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాలను నొక్కి చెప్పారు. ప్రొఫెసర్ రావు, ఫిలిప్ ఇద్దరూ యోగా సెషన్‌లో చురుకుగా పాల్గొన్నారు.
గీతం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రఖ్యాత యోగా నిపుణుడు, బాలకృష్ణ హాజరై, యోగా ప్రాముఖ్యతను వివరించారు. మొత్తం కార్యక్రమాన్ని డైరెక్టరేట్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ స్టూడెంట్ లైఫ్ ద్వారా గీతం ఎన్సీసీ యూనిట్ సమన్వయంతో నిర్వహించారు.