హార్ట్ ఫుల్ నేస్, శ్రీ రామ చంద్ర మిషన్, సాంస్కృతిక శాఖల సంయుక్త అధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్ లో నిర్వహిస్తున్న యోగా శిక్షణా తరగతుల ప్రాంగణాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, కాకతీయ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ తాటికొండ రమేష్, ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య తదితరులు ఈ ప్రాంగణంలో ఏర్పాట్లు, కార్యక్రమాలను పరిశీలించారు. హనుమకొండకు విచ్చేసిన శ్రీ రామ చంద్ర మిషన్ దాజీని ఘనంగా ఆహ్వానించి, సత్కరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.