Bathukamma 2025: యువ కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్’ పేరిట పోటీలు నిర్వహించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తదితరాలు), తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటలపై పోటీలు నిర్వహిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాలకు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదని గైడ్‌లైన్స్‌లో పేర్కొంది.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ప్రజా పాలన, తెలంగాణ పండుగలు, చరిత్ర, సంస్కృతి నేపథ్యంగా పోటీలు
పోటీలో పాల్గొనేందుకు యువ సృజనశీలురకు ఆహ్వానం – -దిల్ రాజు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్
— IPRDepartment (@IPRTelangana) September 16, 2025
ఈ పోటీలో పాల్గొనే వారి వయసు 40 ఏళ్ల లోపు ఉండాలి. వీడియో క్వాలిటీ 4K రిజల్యూషన్ కలిగి ఉండాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు పేర్కొన్నారు. ఈ పోటీల్లో సూచించిన ‘థీమ్’ ల పైనే షార్ట్ ఫిల్మ్ లేదా పాటను రూపొందించాలి. గతంలో ఎక్కడా ప్రదర్శించిన వీడియోలు కాకుండా కొత్త వీడియోలను మాత్రమే ఈ పోటీలో ప్రదర్శించాలని తెలిపారు. చివరిగా బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/transgenders-recruited-as-metro-security-guards/
ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం రూ. లక్షల్లోనే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందించనుంది. ప్రథమ బహుమతి – రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి – రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి – రూ. 1 లక్షగా నిర్ణయించింది. ఇక కన్సొలేషన్ బహుమతి కింద ఐదుగురికి రూ. 20 వేలు ఇవ్వడంతో పాటు విజేతలందరికీ ప్రశంసా పత్రం, జ్ఞాపిక ప్రదానం చేస్తారు.
Also Read: https://teluguprabha.net/news/ntr-in-us-consulate-hyderabad/
తుది గడువు సెప్టెంబర్ 30, 2025 కాగా, నిర్దేశిత గడువులోగా వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీల్లో ఎంపికలు పూర్తి చేస్తుంది. ఎంట్రీలను [email protected] కు పంపగలరు. లేదా వాట్సాప్ నెంబర్ – 8125834009 (WhatsApp Only)కు పంపించవచ్చని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేర్కొంది.


