Suicide Attempt for Marriage: ఊహ తెలిసిన వయసు నుంచి మరదలినే తన జీవిత భాగస్వామిగా కలలుగన్న యువకుడు.. ఆ కలలు నిజం కావడం లేదనే బాధతో ఈ లోకంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. తన మరదలితో వివాహం జరపడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. తన మామ, మరదలు ఇద్దరు తనను మోసం చేశారనే ఆవేదనతో యువకుడు.. సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోవాలనుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/10-lakh-kidney-and-cancer-cases-registered-in-telangana/
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బోల్లోనిపల్లిలో మోహన్.. చిన్నతనం నుంచి తన మామ కూతురితో వివాహం జరిపిస్తానని మాట ఇచ్చి తప్పారని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. మరదలుపై ప్రేమ పెంచుకున్నానని.. కానీ మరదలితో ఇచ్చి పెళ్లి చేయడానికి అత్తమామలు నిరాకరిస్తున్నారని, తన మరదలు కూడా మోసం చేసిందనే ఆవేదనతో తీవ్ర మనస్తాపం చెందినట్లు యువకుడు తెలిపాడు. ఈ కారణంగా పురుగుల మందు సేవిస్తున్నట్లు సెల్ఫీ వీడియో తీసి వీడియోను గ్రామంలోని వాట్సప్ గ్రూప్‌లో, తన స్నేహితులకు పోస్ట్ చేశాడు.
Also Read: https://teluguprabha.net/telangana-news/kcr-maganti-sunitha-jubilee-hills-bypoll-b-form-brs/
వెంటనే మోహన్ స్నేహితులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో లొకేషన్ ఆధారంగా యువకుడిని మంగళపల్లి శివారులో గుర్తించారు. ప్రాణాపాయస్థితిలో పడి ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.


