చిలుకూరు బాలాజీ ఆలయం(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్(Rangarajan)కు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Jagan) ఫోన్ చేసి మాట్లాడారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీసి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామరాజ్యం ఆర్మీ డిమాండ్లు..జరిగిన వాగ్వివాదం..తనను చిత్రహింసలు పెట్టిన తీరును జగన్‌కు రంగరాజన్ వివరించారు. అలాగే దివంగత వైఎస్సార్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు.
కాగా రంగరాజన్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్, పవన్ కళ్యాణ్, ఇతర నాయకులు రంగరాజన్‌ను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఇక దాడి చేసిన రామరాజ్యం వ్యవస్థాపడు వీరరాఘవ రెడ్డితో పాటు మిగిలిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.