YS Viveka|దివంగత మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా సమావేశాలు పెట్టకూడదని.. దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. దీంతో శివశంకర్ రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.
మరోవైపు వివేకానంద రెడ్డి మాజీ పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. పులివెందులలోని కృష్ణారెడ్ ఇంట్లో పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబు ఆయనను స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. గతంలో సీబీఐ అధికారి రాంసింగ్‌పై కృష్ణారెడ్డి పోలీసుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.