Saturday, November 23, 2024
HomeతెలంగాణRamulu Nayak: కేసిఆర్ నాయకత్వంలొనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమైంది

Ramulu Nayak: కేసిఆర్ నాయకత్వంలొనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమైంది

వైరా మున్సిపల్ కార్యాలయము నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ సభాధ్యక్షులుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియ రాములు నాయక్, మరో ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) స్నేహలత ఐఏఎస్ హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి. శాంతి భద్రత విషయంలో కూడా ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టి అన్ని రంగాలని అభివృద్ధిలో తీసుకువెళ్తూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ప్రజలందరూ సంతోషాలతో జీవించేటట్టు సుపరిపాలన సాధించడం జరిగిందన్నారు. సపరిపాలన మరలా కావాలి అంటే కచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని చేయాలని, మరొకసారి నన్ను ఆశీర్వదించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ 3116/- రూపాయలు నుంచి 4116 /- లకు పెంచిన సందర్భంగా వచ్చిన దివ్యాంగుల తో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, వైరా మార్కెట్ చైర్మన్ బీడీకే రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, వైరా తహసీల్దార్ అరుణ, జిల్లా దిశా కమిటీ సభ్యులు కట్ట కృష్ణార్జున రావు, జిల్లా రైతుబంధు కమిటీ సభ్యులు మచ్చా నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ,వైరా మున్సిపల్ కౌన్సిలర్స్ సీనియర్ నాయకుడు వనమా విశ్వేశ్వరరావు, మాదినేని సునీత ,డాక్టర్ దారెల్లి కోటయ్య, తడికమల్లి నాగేశ్వరరావు ,చల్లగుండ్ల నాగేశ్వరరావు ,లగడపాటి లక్ష్మీ రాజ్యం ,దారెల్లి పవిత్ర కుమారి , ఇమ్మడి రామారావు ,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అప్పం సురేష్ ,డిపిఎం సుజాత , వైరా ఎంపీడీవో శ్రీదేవి, రామాలయం టెంపుల్ చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు ,జిల్లా నాయకులు మచ్చా బుజ్జి ,మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, టౌన్ పార్టీ అధ్యక్షులు మద్దెల రవి ,పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్, బి ఆర్ యస్ పార్టీ నాయకులు ,మహిళా సోదరీ సోదరీమణులు ,రైతులు దివ్యాంగులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News