సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యుత్ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగులూర్ కళ్లెంజంగారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ..
దేశానికి తెలంగాణ రాష్ట్ర వెలుగుల పంట అని, నిరంతర కరెంటుతోనే తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు ఎమ్మెల్యే. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వమని, తెలంగాణ వస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసే పరిస్థితి వస్తుందని గత నాయకులు చేసిన హేళన మాటలను వమ్ము చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసి చూపిస్తున్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. గతంలో 11సబ్ స్టేషన్లు ఉన్న మన నియోజకవర్గం ఇప్పుడు 33 సబ్ స్టేషన్లతో కళకళలాడుతుందని, ముఖ్యంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే దేశంలో ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తిరుపతి రావు, జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీఈ యాదగిరి, ఎంపిపిలు, జడ్పిటిసిలు, చైర్పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.