HomeTop StoriesTG Pensions: షాకింగ్‌ న్యూస్‌.. ఒకేసారి 1.28 లక్షల పెన్షన్లు రద్దు.. మీ పేరు ఉందేమో...

TG Pensions: షాకింగ్‌ న్యూస్‌.. ఒకేసారి 1.28 లక్షల పెన్షన్లు రద్దు.. మీ పేరు ఉందేమో చూసుకోండి..!

1.28 lakh pensions cancelled in the Telangana: తెలంగాణ ప్రభుత్వం షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఏకంగా 1.28 లక్షల పెన్షన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో ఇటీవల చేపట్టిన సమగ్ర పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి చేయగా.. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు 1.28 లక్షల పెన్షన్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో నిజమైన లబ్ధిదారులకు మేలు చేకూరుస్తూ కొత్తగా 48 వేల మందితో కూడిన సరికొత్త జాబితాను కూడా అధికారులు సిద్ధం చేశారు.

- Advertisement -

Also Read: PM Kisan: గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు..

రాష్ట్రంలో అందిస్తున్న వివిధ రకాల పెన్షన్ల విషయంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మృతులు, సుదీర్ఘకాలంగా అందుబాటులో లేనివారు, వలస వెళ్లిన వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఇంకా కొనసాగుతుండటంతో వాటిని తొలగించారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న సంపన్నులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని గుర్తించి వారి పెన్షన్లను తొలగించారు. రద్దైన మొత్తం 1.28 లక్షల పెన్షన్లలో అత్యధికంగా 1.02 లక్షల పెన్షన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కాగా.. మిగిలినవి మున్సిపాలిటీల పరిధిలో ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే, అనర్హుల తొలగింపుతో ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా, అసలైన అర్హులకు అవకాశం లభించింది. అర్హత ఉండి కూడా ఇంతకాలం పెన్షన్లు రాని 48 వేల మంది వికలాంగులు, వితంతువుల పేర్లతో అధికారులు కొత్త జాబితాను రెడీ చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన వెంటనే కొత్త లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయనుంది. దీనిపై త్వరలోనే అధికారిక రానున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News