HomeతెలంగాణHyderabad: 12 యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల భారీ ధర్నా

Hyderabad: 12 యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల భారీ ధర్నా

అబిడ్స్, అక్టోబర్ 15 (తెలుగు ప్రభ): రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేసే 1,200 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నేడు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కార్యాలయాన్ని ముట్టడించారు. చలో హైదరాబాద్ పిలుపు మేరకు రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున కదిలివచ్చారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం వీరిని రెగ్యులర్ చేయాలని కోరారు. గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో తెలంగాణలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని, సెవెంత్ పీఆర్సీ స్కేల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 11 రోజుల పాటు నిరవధిక సమ్మె నిర్వహించారు. దాని దరిమిలా 12 యూనివర్సిటీల్లో విద్యాబోధన స్తంభించింది. అప్పుడు ముఖ్యమంత్రి యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చి సమ్మె విరమించాలని సూచించారు.

తదనుగుణంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మెను విరమించారు. కానీ నేటికీ సీఎం హామీ నెరవేరలేదు. పైగా, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ రోజు జీవో నంబర్ 31ను జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్లు జరిపితే 20 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1,200 మంది కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల భవిష్యత్తు ఏమి కావాలని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేసిన తర్వాతే రిక్రూట్‌మెంట్ జరపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News