HomeTop StoriesHeat Wave: వడదెబ్బ ఎఫెక్ట్‌.. ఒక్కరోజే 22 మంది మృతి

Heat Wave: వడదెబ్బ ఎఫెక్ట్‌.. ఒక్కరోజే 22 మంది మృతి

Summer Heat Wave 22 Died: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మొన్నటివరకూ 44 డిగ్రీలకు పరిమితమైన ఉష్ణోగ్రతలు ఈ సారి ఆ గరిష్ఠ పరిమితిని సైతం దాటేశాయి. భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారిపోయాయి. నిన్న ఒక్కరోజే 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేసవి తాపానికి పలువురు మృతి చెందారు.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/telangana-bjp-meeting-is-going-to-be-held-today/

మునుపెన్నడూ లేని విధంగా గురువారం ఒక్కరోజే తెలంగాణలో ఒకేసారి 20 జిల్లాల్లో 46 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో వడదెబ్బ తలిగి రాష్ట్రవ్యాప్తందా 22 మంది మృతి చెందారు. మరోవైపు శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మ, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు కూడా 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచా వేసింది.  

Also Read: https://teluguprabha.net/sports-news/gujarat-titans-beat-chennai-super-kings-by-89-runs-ipl-2026/

ఏపీలోని అల్లూరి, కృష్ణా, ఎన్టీఆర్‌, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో శుక్రవారం 45- 47 డిగ్రీలు, మిగతా జిల్లాల్లో 40- 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణల సంస్థ వెల్లడించింది. మరోవైపు 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 219 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా, ఓవైపు ఎండలు ముదిరిపోతుండగా.. గురువారం రాత్రి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఈ రోజు సైతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని APSDMA తెలిపింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News