HomeTop StoriesPM Modi: ప్రధాని పర్యటనకు 2,620 మంది సిబ్బందితో బందోబస్తు: మల్కాజ్‌గిరి సీపీ

PM Modi: ప్రధాని పర్యటనకు 2,620 మంది సిబ్బందితో బందోబస్తు: మల్కాజ్‌గిరి సీపీ

PM Modi Telangana Visit: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(ఆదివారం) తెలంగాణ పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌ నగరంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2,620 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సుమతి తెలిపారు. మొత్తం సిబ్బందిలో 2,000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు కాగా, 620 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌ పరిసర ప్రాంతాలను శనివారం రాత్రి 12 నుంచి నో ఫ్లై జోన్​గా ప్రకటించామని సీపీ వెల్లడించారు. అనుమతి లేని వస్తువులను ప్రజలు సభకు తీసుకురావద్దన్నారు. ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 24 మంది ఏసీపీలతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ నిర్వహించనున్నట్లు వివరించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/special-movie-on-revanth-reddy-political-journey/

ప్రధాని ప్రసంగం నేపథ్యంలో సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను 24 గంటల పాటు నిఘాలో ఉంచేందుకు 150కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. అక్టోపస్, గ్రేహౌండ్స్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు, స్నిఫర్ డాగ్ బృందాలను రంగంలోకి దించారు. ఎన్‌క్లోజర్‌ల వద్ద మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ మోహరించనున్నాయి. 

భద్రతా కారణాల దృష్ట్యా సభా ప్రాంగణంలోకి హ్యాండ్‌బ్యాగులు, ఇతర వస్తువులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. కేవలం నిర్ణీత గేట్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నారు. ప్రధాని పర్యటన కోసం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి పరేడ్‌ గ్రౌండ్స్‌ వరకు ఉన్న కాన్వాయ్‌ మార్గాల్లో కూడా పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana/khammam-news/english-lecturer-collapses-in-classroom-while-giving-demo-in-madhira/

ప్రధాని పర్యటనలో విశేషాలివే

ఈ పర్యటనలో భాగంగా సుమారు రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపనతో పాటు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రధాని ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌లో క్యాన్సర్ చికిత్సపై దృష్టి సారించే మల్టీ-సూపర్ స్పెషాలిటీ ‘సింధు ఆసుపత్రి’ని జాతికి అంకితం చేయనున్నారు. సుమారు రూ. 1,535 కోట్ల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను, కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. హైదరాబాద్‌లోని మల్కాపూర్ వద్ద రూ. 600 కోట్లతో చేపట్టిన ఇండియన్ ఆయిల్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News