Homeతెలంగాణఖమ్మంStolen Mobile Phones: సీఈఐఆర్‌ పోర్టల్‌తో 32 ఫోన్లు రికవరీ

Stolen Mobile Phones: సీఈఐఆర్‌ పోర్టల్‌తో 32 ఫోన్లు రికవరీ

భద్రాచలం, అక్టోబర్‌ 5 (తెలుగు ప్రభ): భద్రాచలం పట్టణంలో మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు డీఎస్పీ ఎం. అరుణ్‌కుమార్‌ సోమవారం ఫోన్లను అందజేశారు. భద్రాచలం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వివిధ సందర్భాల్లో మొబైల్‌ ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల మేరకు వివరాలను సీఈఐఆర్‌ పోర్టల్‌లో నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. రికవరీ చేసిన 32 మొబైల్‌ ఫోన్లను సంబంధిత బాధితులకు అప్పగించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకోవడం లేదా చోరీకి గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ సూచించారు. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మొబైల్‌ ఫోన్లు ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఫోన్లను నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ ఉంచరాదని సూచించారు. మొబైల్‌ ఫోన్‌ పోయినా లేదా చోరీకి గురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌, ఇతర వివరాలను పోలీసులకు అందించాలని డీఎస్పీ ఎం. అరుణ్‌కుమార్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News