HomeTop StoriesMaoists: తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు

Maoists: తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు

Maoists Surrender Telangana: తెలంగాణ డీజీపీ ఎదుట భారీ స్థాయిలో శుక్రవారం కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. PLGA డిప్యూటీ కమాండర్‌ సోది కేశాలు అలియాస్‌ మల్లాతో పాటు 42 మంది మావోలు లొంగిపోయినట్లు డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. దీంతో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందని.. తెలంగాణలో మావోయిస్టు సాయుధ పోరాటం ముగిసిందని డీజీపీ ప్రకటించారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/good-news-for-telangana-rtc-employees-da-hiked-by-2-1-percent/

Image
maoists surrender

లొంగిపోయిన మొత్తం 42 మందిలో 21 మంది PLGA బెటాలియన్ సభ్యులు, 11 మంది తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, 10 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. PLGA బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోడి మల్ల అలియాస్ కేశాలు, రాష్ట్ర కమిటీ మిలిటరీ చీఫ్ చాప నారాయణ అలియాస్ గజేందర్, డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు వంటి కీలక నాయకులు లొంగిపోయిన వారిలో ఉన్నారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-naidu-is-angry-with-ministers-over-information-leakage/

Image
Maoists Surrender

వీరు 5 AK-47లు, 4 SLRలు, 3 ఇన్సాస్ రైఫిళ్లు, 6 .303 రైఫిళ్లు, స్టెన్ గన్‌లు, పిస్టళ్లు, 1,007 రౌండ్ల మందుగుండు సామాగ్రిని పోలీసులకు అప్పగించారు. అంతేకాకుండా పార్టీ నిధిగా భావించిన దాదాపు 800 గ్రాముల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో పోలీసులకు సమర్పించారు. ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ కూంబింగ్ తీవ్రం కావడంతో, వీరు ములుగు, భూపాలపల్లి మీదుగా వచ్చి రాష్ట్ర పోలీసులను ఆశ్రయించగా.. ప్రభుత్వం తరపున దాదాపు రూ. 1.93 కోట్ల రివార్డు సొమ్మును అందజేయనున్నట్లు డీజీపీ వివరించారు. అయితే ఇంకా ఐదుగురు కీలక నేతలు ( ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నారని, వారు సైతం త్వరగా లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News