Formula E Car Race ACB KTR: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏసీబీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. జులై 31న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Also Read: https://teluguprabha.net/business/silver-prices-have-fallen-sharply/
ఫార్ములా ఈ- కార్ రేస్ నిధుల మళ్లింపు వ్యవహారంలో గత మార్చిలో అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన సుమారు 250 పేజీల ఛార్జిషీట్‌ను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు గురువారం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్. రెడ్డిని నిందితులుగా చేర్చారు. ఛార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టు.. కేటీఆర్‌తో పాటు అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి, ఏ4 స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావుకు జులై 31న కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా- ఈ కార్ రేసు కోసం ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ. 55 కోట్లను విదేశీ సంస్థకు మళ్లించారని ఏసీబీ అభియోగపత్రంలో పేర్కొంది.

