ACB Raids: తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ (ACB) అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో… హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ (GM) కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని విస్తృత సోదాలు చేపట్టారు.
ఉదయం 6 గంటలకే రంగంలోకి దిగిన ఏసీబీ: మల్లాపూర్ పరిధిలోని జలమండలి జీఎం కుమార్ సొంత నివాసంలో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించాయి. మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకే ఏసీబీ అధికారులు కుమార్ ఇంటికి చేరుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎవరినీ బయటకు వెళ్లకుండా, లోపలికి రాకుండా ఆంక్షలు విధించారు. ఇంటి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.
Also read-Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి 44 ఏళ్లకు పొడిగింపు!
సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు: కేవలం జీఎం కుమార్ నివాసంలోనే కాకుండా.. ఆయనకు సంబంధించిన కీలకమైన నెట్‌వర్క్‌పై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఆయన అత్యంత సన్నిహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదుతోపాటు కీలక పత్రాలు లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

