HomeతెలంగాణACB: సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇళ్లపై ఏసీబీ మెరుపు దాడులు!

ACB: సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇళ్లపై ఏసీబీ మెరుపు దాడులు!

Additional SP Bhujanga Rao: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ అదనపు ఎస్పీ (అడిషనల్ ఎస్పీ) భుజంగరావు ఇళ్లపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం నుంచి ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో గతంలోనే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

- Advertisement -

ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు: భుజంగరావు భారీగా ఆక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు, ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రాథమిక ఆధారాలతో రంగంలోకి దిగారు. భుజంగరావు స్వగృహంతో పాటు ఆయన బంధువులు, అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యుల నివాసాలపై అధికారులు విరుచుకుపడ్డారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సోదాల్లో ఆయనకు సంబంధించిన పలు ఆస్తుల డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్ల వివరాలు, నగదు మరియు బంగారాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Also read-Telangana: మళ్లీ సెంటిమెంట్ పాలిటిక్స్‌.. బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం!

రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో.. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు చేపట్టడం పోలీసు వర్గాలతో పాటు రాజకీయంగానూ తీవ్ర కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ నెపంతో సాగిన అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లతో ఏమైనా ఆస్తులు కూడబెట్టారా? అనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల ముగింపులో ఎంతమేర అక్రమ ఆస్తులు వెలుగులోకి వస్తాయనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News