HomeTop StoriesMoinabad Drugs Case: ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులకు ఏప్రిల్‌ 8 వరకు రిమాండ్‌..

Moinabad Drugs Case: ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులకు ఏప్రిల్‌ 8 వరకు రిమాండ్‌..

Moinabad Farm House Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ముగ్గురు నిందితులను 3 రోజుల పాటు ప్రశ్నించిన సిట్‌.. అనంతరం శంషాబాద్‌ పీఎస్‌ నుంచి కోర్టుకు నిందితులను తరలించింది. విచారణ జరిపిన న్యాయస్థానం వచ్చే నెల 8 వరకు రిమాండ్‌ పొడిగించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/mother-kills-daughter-for-crying-out-for-milk/

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులైన మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్‌ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్‌ శర్మలకు ఉప్పర్‌పల్లి కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. వచ్చేనెల 8 వరకు రిమాండ్‌ విధించింది. దీంతో ముగ్గురు నిందితులను జైలుకి తరలించారు.

మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితులను సిట్‌ లోతుగా విచారించింది. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు వీరిని ప్రశ్నించారు. పోలీస్‌ స్టేషన్‌లోనే నిందితులకు సిట్‌ బృందం వైద్య పరీక్షలు పూర్తి చేసింది. పార్టీలో కాల్పులు, డ్రగ్స్‌ అంశాలపై కీలక సమాచారం సేకరించింది. 

Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-wife-anna-lezhneva-pens-emotional-note-on-chiranjeevi-and-naga-babu/

ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం 9 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు భావిస్తున్న కీలక నిందితుడు అభిషేక్ సింగ్‌ను, అదేవిధంగా డ్రగ్ సప్లయర్ బాలాజీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ కేసులో సంబంధం ఉన్న ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌కు స్టేషన్‌ బెయిల్ లభించింది.

మార్చి 14న మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌పై జరిగిన దాడిలో పోలీసులు కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి సమయంలో నమిత్‌ శర్మ రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News