Mancherial Country bombs: మంచిర్యాల జిల్లాలో నాటు బాంబుల పేలుడు కలకలం సృష్టించింది. పశువులు మేతల కోసం వెళ్లగా పొదల్లో నాటు బాంబులు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరికొన్ని నాటు బాంబులు గుర్తించారు. జన్నారం మండలం బాదంపల్లి సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/minister-nara-lokesh-announced-project-punarviak/
బాదంపల్లి సమీపంలోని గోదావరి తీరంలో మేతకు వెళ్లిన గేదెల మందలో ఒక నాటు బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు ధాటికి ఒక గేదెకు తీవ్రంగా గాయాల్యయాయి. ప్రమాదం జరిగిన వెంటనే పశువుల కాపరి భయంతో గ్రామంలోకి వెల్లి సమాచారం అందించారు. గ్రామస్తులు వెళ్లి చూడగా, గోదావరి తీరంలోని ముళ్ల పొదల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న నాటు బాంబులను గుర్తించారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ప్రాంతం కవ్వాల్ అభయారణ్యానికి సమీపంలో ఉండటంతో, వన్యప్రాణుల వేట కోసం దుండగులు ఈ బాంబులను అక్కడ ఉంచి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు చేపడుతున్నారు.

