నిర్మల్ టౌన్ (తెలుగు ప్రభ): శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం నిర్మల్ టౌన్ గాంధీ చౌక్‌లోని శ్రీ మురళీకృష్ణ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొని, ఆలయ అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం రాంరావ్ బాగ్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించినట్లు తెలిపారు. ధర్మాన్ని, సత్యాన్ని, మంచితనాన్ని ఆచరించాలనే సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితంతో ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మేడారం అపరణ ప్రదీప్ కోపషన్ మెంబెర్స్, ధర్మాజీ రాజేందర్ ఎఫ్ఎసిఎస్ చైర్మన్, మూడుసు సత్యనారాయణ డిసిసి అధికార ప్రతినిధి, ఆకుల హరీష్ నిర్మల్ టౌన్ అధ్యక్షులు, లక్కాకుల హరీష్ కౌన్సిలర్, రామకృష్ణ మాజీ కౌన్సిలర్, పీవీ రమణ రెడ్డి పీ ఎ సీ ఎస్ చైర్మన్, మల్లేష్ యాదవ్ నిర్మల్ మండల్ అధ్యక్షులు, గంగారెడ్డి మాజీ ఆత్మ చైర్మన్, శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్, రమేష్ రెడ్డి మాజీ సర్పంచ్,రవి కిరణ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.


