HomeTop StoriesKhanapur Municipality: కౌన్సిల్‌ హాల్‌లో ఉద్రిక్తత.. ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా

Khanapur Municipality: కౌన్సిల్‌ హాల్‌లో ఉద్రిక్తత.. ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా

Khanapur Municipality Election: రాజకీయ అనిశ్చితుల మధ్య ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఈ రోజు మరోసారి వాయిదా పడింది. గందరగోళం కారణంగా అధికారులు ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఖానాపూర్‌ మున్సిపల్‌ హాల్‌లో చేతులు లేపే క్రమంలో వివాదం తలెత్తింది. అంతేకాకుండా అధికారులతో ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సభ్యుల వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మున్సిపల్‌ కార్యాలయం గేటు ముందు బీఆర్ఎస్‌, బీజేపీ నాయకులు ఎన్నిక జరపాలంటూ నినాదాలు చేశారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/brs-mla-padi-kaushik-reddy-comments-after-cid-interrogation/

ఈ రోజు జరగాల్సిన ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతల మధ్య రేపటికి వాయిదా పడింది. కౌన్సిలర్ల మధ్య తలెత్తిన తీవ్ర వాగ్వాదం, గందరగోళ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘మ్యాజిక్ ఫిగర్’ విషయంలో గందరగోళం ఏర్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఎన్నికపై ప్రభావం చూపింది. బీజేపీ అభ్యర్థి మౌనికకు ఏడుగురు కౌన్సిలర్ల మద్దతు ఉండటంతో ఆమెను ఛైర్మన్‌గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేయగా.. తమకు కూడా ఏడుగురి మద్దతు ఉందని కాంగ్రెస్ వాదించడంతో కౌన్సిల్‌ హాల్‌లో హైడ్రామా నెలకొంది.

Also Read: https://teluguprabha.net/business-news/viral-drink-coconut-water-and-iced-coffee/

గందరగోళం నడుమ ఎన్నిక వాయిదా వేయడంతో దీనిని నిరసిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాయి. అధికారులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News