Saturday, March 14, 2026
HomeTop StoriesBalka Suman: బాల్క సుమన్‌కు ఊరట.. క్యాతనపల్లి ఘటనలో బెయిల్‌ మంజూరు.!

Balka Suman: బాల్క సుమన్‌కు ఊరట.. క్యాతనపల్లి ఘటనలో బెయిల్‌ మంజూరు.!

Balka Suman Bail Petition: బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వర్గం ఎన్నికల ఘర్షణల కేసులో మంచిర్యాల జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/international-news/flight-services-cancelled-due-to-war-in-gulf-countries/

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ వర్గం ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి వివేక్‌ వెంకటస్వామి కాన్వాయ్‌పై జరిగిన దాడి, అల్లర్ల కేసులో ఫిబ్రవరి 18న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు 20 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఆయన గత 15 రోజులుగా ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్‌ కోసం పలుమార్లు పిటిషన్‌ దాఖలు చేయగా.. మంచిర్యాల జిల్లా కోర్టు వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం తీర్పు వెలుపడింది. సుమన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 

Also Read: https://teluguprabha.net/cinema-news/vijay-rashmika-couple-house-warming-in-nagarkurnool-district/

సుమన్‌కు బెయిల్‌ మంజూరు చేసిన జిల్లా కోర్టు రూ. 25,000 విలువైన పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత, ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News