బెల్లంపల్లి (తెలుగు ప్రభ): మంచిర్యాల జిల్లా నెన్నల్ మండలం నందులపల్లిలోని శ్రీలక్ష్మి శ్రీనివాస రైస్ మిల్లును కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. రైతులకు, ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యాన్ని దారి మళ్లించి రైస్ మిల్లు యజమానులు కోట్ల రూపాయలను కొల్లగొట్టారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ధాన్యాన్ని దారి మళ్లించి రూ. 4.32 కోట్ల భారీ అక్రమాలకు పాల్పడటంతో అధికారులు రంగంలోకి దిగారు. అధికారుల విచారణలో అక్రమాలు జరిగింది వాస్తవమేనని బహిర్గతమైంది. దీంతో కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి దాడి నిర్వహించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లును సీజ్ చేసి సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చారు.
దాడుల్లో మంచిర్యాల డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకళ, నెన్నెల్ తహసీల్దార్ శ్రీనివాస్, డిటి శ్రీనివాస్, నెన్నెల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచన, సీఎస్ ఇన్స్పెక్టర్ భూమేష్, జిపిఓ లు సుజాత, రజిత, పంచాయతీ కార్యదర్శి సరిత లు ఉన్నారు.

