ముథోల్, (తెలుగు ప్రభ): నిర్మల్ జిల్లా ముథోల్‌లోని పాన్‌షాపులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎస్సై బిట్ల పెర్సిస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పలు పాన్‌షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్‌షాపుల్లో విక్రయిస్తున్న వస్తువులను పరిశీలించి, నిర్వాహకులకు నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మైనర్లకు సిగరెట్లు, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించవద్దని స్పష్టం చేశారు.
పాన్‌షాపులను అడ్డుపెట్టుకుని అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్లను పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంచేందుకు పాన్‌షాపుల నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

