Homeతెలంగాణఆదిలాబాద్Library : తలమడుగు తరగని వ్యధ: అక్షరాల ఆలయానికి సొంత గూడేది?

Library : తలమడుగు తరగని వ్యధ: అక్షరాల ఆలయానికి సొంత గూడేది?

తలమడుగు ( తెలుగు ప్రభ ) : జ్ఞాన సముపార్జనకు బాటలు వేస్తూ భావి తరాల భవితను తీర్చిదిద్దే అక్షర భాండాగారాలు నిరాదరణకు గురవుతుంటే గ్రామీణ యువతకు దిక్కెవరు? ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని గ్రంథాలయం దీనస్థితి చూస్తే పాలకులు విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యంపై అనుమానాలు కలగక మానవు.

- Advertisement -

ప్రస్తుతం తలమడుగు గ్రంథాలయం స్థానిక యూత్ భవనంలో అరకొర వసతుల నడుమ కాలం వెళ్లదీస్తోంది. మండల పరిధిలోని పల్లెల నుంచి డీఎస్సీ, గ్రూప్స్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వందలాది మంది అభ్యర్థులకు ఇది ఏకైక ఆశ్రయం. అయితే ప్రశాంతమైన వాతావరణం, కూర్చునేందుకు తగిన స్థలం, తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో చదువరులు నానా అవస్థలు పడుతున్నారు.

నూతన గ్రంథాలయ భవనం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు ‘నీటిమూటలు’గానే మిగిలిపోయాయి. అధికారులు, పాలకులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి, నిధులు మంజూరు చేసి తక్షణమే అన్ని హంగులతో కూడిన పక్కా భవనం నిర్మించాలని విద్యార్థులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News