HomeTop StoriesYashoda Hospitals: యశోద హాస్పిటల్స్‌లో ఏఐ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్.. హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు

Yashoda Hospitals: యశోద హాస్పిటల్స్‌లో ఏఐ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్.. హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు

AI International Conference at Yashoda Hospitals: ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) వినియోగం, ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై యశోద హాస్పిటల్‌ యాజమాన్యం అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. “ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ 2.0” పేరుతో యశోద హాస్పిటల్స్‌ తన హైటెక్ సిటీ బ్రాంచులో ఈ సదస్సు నిర్వహిస్తోంది. “పవరింగ్ ప్రెసిషన్ & పర్శలైజింగ్ కేర్” అనే అంశంపై నేడు, రేపు (జూన్ 13, 14) వ తేదీల్లో రెండ్రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ వైద్య సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు, వైద్య పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఏఐ సాంకేతిక నిపుణులు సహా 2 వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ సదస్సును శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జీఎస్. రావు కలిసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత విప్లవాత్మక మార్పులు, వినూత్న ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.

- Advertisement -
యశోద హాస్పిటల్స్‌లో ఏఐ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్‌ బాబు

Also Read: Shabbir Ali: షబ్బీర్‌ అలీపై అధిష్టానం సీరియస్‌.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు..!

సదస్సులో 2 వేల మందికి పైగా పాల్గొన్న నిపుణులు..

ఇవాళ సదస్సు తొలిరోజు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి ఆర్గనైజింగ్ చైర్ పర్సన్‌‌గా వ్యవహరించారు. నేడు ఈ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా 2 వేల మందికి పైగా వైద్య, సాంకేతిక, పరిశోధన, విధాన నిపుణులు పాల్గొన్నారు. ప్రెసిషన్ మెడిసిన్, ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్స్, డిజిటల్ పాథాలజీ, రోబోటిక్ సర్జరీ, డ్రగ్ డిస్కవరీ, క్లినికల్ ఏఐ అప్లికేషన్స్ తదితర అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐఐఐటీ హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, ఐఎస్‌బీ, నోవార్టిస్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కింగ్స్ కాలేజ్ లండన్, మెడ్ట్రానిక్, టీసీఎస్ తదితర ప్రముఖ సంస్థల నిపుణులు తమ అనుభవాలు, పరిశోధన ఫలితాలు పంచుకోగా.. పాలసీ పావిలియన్, స్టార్టప్ ఇన్నోవేషన్ సెషన్లు ఈ సదస్సులో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో ఆరోగ్య రంగం కూడా కీలక పరివర్తన దశలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్, డీప్‌టెక్ రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ సదస్సు పరిశోధన, స్టార్టప్‌లు, పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసి, తెలంగాణను అంతర్జాతీయ స్థాయి ఇన్నోవేషన్ కేంద్రంగా నిలబెట్టే దిశగా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.

యశోద హాస్పిటల్స్‌లో నిర్వహిస్తున్న ఏఐ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రముఖ వైద్యులు, వైద్య పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు

Also read: Education : కేంద్రీయాల్లో కీలక కదలిక: సంస్కృత సెక్షన్ ఇక తప్పనిసరి.. మూడో భాషగా మాతృభాషకూ ఛాన్స్!

ఏఐ రాకతో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు..

సదస్సులో యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. ఎస్. రావు మాట్లాడుతూ.. ఆరోగ్యరంగంలో ఏఐ వినియోగం వైద్య సేవల నాణ్యత, వేగం, ఖచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, క్లిష్టమైన కేసుల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలను అందించడం వంటి అంశాల్లో ఏఐ విశేష ఫలితాలను అందిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ సదస్సు, ఆరోగ్యరంగ భవిష్యత్తుపై విలువైన చర్చలకు దోహదపడటమే కాకుండా, కొత్త ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, పరిశోధనలకు మార్గం సుగమం చేసిందని స్పష్టం చేశారు. ఈ కాన్ఫరెన్స్‌పై యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, క్లినికల్ డైరెక్టర్ & రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చినబాబు సుంకవల్లి మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదని, అది ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు. మరింత ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ, సమర్థవంతమైన వైద్య విధానాలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన చికిత్సలను అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ సదస్సు, ఆరోగ్యరంగంలో తదుపరి విప్లవానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ హెల్త్ టెక్ హబ్‌గా మరింత బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు ఒక ముఖ్యమైన ముందడుగుగా డాక్టర్. చినబాబు సుంకవల్లి అభివర్ణించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News