Another 200 crore for Siddhapur Reservoir: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయని, బీఆర్‌ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం వాళ్ల హయాంలోనే కూలిపోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల పరిస్థితి ఏమైందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన.. జాకోరా, చందూర్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం, సిద్ధాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు మరో రూ. 200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. సవరించిన అంచనాల మేరకే సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు మరో రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో త్వరలోనే పూడికతీత పనులు చేపడతామని తెలిపారు. కాలువలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్‌టం చేశారు.
Also read: Key meeting in Delhi: ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల భేటీ.. చంద్రబాబు, పవన్ హాజరు

