Telugu Techie Died in Florida: అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి చెందారు. ఇటీవల ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సురేష్ కుమార్(41) గుండెపోటుతో మరణించగా.. తాజాగా తెలంగాణకి చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హఠాన్మరణం చెందారు. గద్వాలకు చెందిన టెకీ సునీల్ కుమార్ గుండ్రాయ్ (51) ఫ్లోరిడాలోని టాంపా నగరంలోని తన ఇంటి ఆవరణలో రెండు రోజుల క్రితం హఠాత్తుగా కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు సమాచారం. సునీల్ కుమార్ ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తుండగా.. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Also Read: https://teluguprabha.net/business/big-shock-for-sbi-credit-card-users/
సునీల్ హఠాన్మరణంతో గద్వాలలోని ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్లు చెన్నైలో పనిచేసిన ఆయన.. మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లినట్లు ఆయన సన్నిహితులు, కుటుంబీకులు తెలిపారు. మృతదేహాన్ని తరలించేందుకు, కుటుంబానికి సాయం చేయడానికి తెలుగు సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: https://teluguprabha.net/top-stories/kcr-to-meet-with-key-brs-leaders/
కాగా, ఇటీవల వర్జీనియాలో నివసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన వీణ(26) ఫ్లోరిడాలో కుటుంబ సభ్యులతో వెళ్లిన సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందారు. ఏపీలోని కడపకి చెందిన మహమ్మద్ షేక్(26) అనే విద్యార్థి అమెరికాలో గుండెపోటుతో మరణించాడు. ఇరగనబోయిన చందు (26), నిరుద్యోగం, ఆర్థిక కష్టాల కారణంగా అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలానికి చెందిన సాయి శ్రీహరికృష్ణ ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే కాలిఫోర్నియాలో మరణించడం విషాదంగా మారింది. వరంగల్‌కు చెందిన తాడిపత్రి రాకేశ్(40) వర్జీనియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ గుండెపోటుతో మరణించారు.

