HomeతెలంగాణKCR Birthday: కేసీఆర్‌కు ఏపీ నేతల బర్త్ డే విషెస్.. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష!

KCR Birthday: కేసీఆర్‌కు ఏపీ నేతల బర్త్ డే విషెస్.. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష!

KCR Birthday wishes: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. కేసీఆర్ జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

పవన్ కల్యాణ్ సందేశం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

Also read-CM Revanth Reddy: కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి!

వైఎస్ జగన్ విషెస్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సోషల్ మీడియా ద్వారా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని వేడుకుంటున్నట్లు జగన్ సామాజిక మాధ్యమాల ద్వారా తన సందేశాన్ని పంపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News