HomeTop StoriesCM Chandrbabu: అనవసరంగా రెచ్చగొడుతున్నారు.. పవన్‌కు మద్దతుగా చంద్రబాబు.. సంచలన కామెంట్స్‌

CM Chandrbabu: అనవసరంగా రెచ్చగొడుతున్నారు.. పవన్‌కు మద్దతుగా చంద్రబాబు.. సంచలన కామెంట్స్‌

AP CM Chandrbabu in support of Pawan Kalyan: ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలి వానలా మారి ఇరు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపాయి. ఈ కామెంట్స్‌తో తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. పవన్‌ కల్యాణ్‌ను తెలంగాణలో అడుగుపెట్టనీయమని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రెస్‌మీట్‌ పెట్టారు. తనపై చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌, కవిత వంటి నేతలు తిప్పి కొట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తెలంగాణ నేతలు అనవసర విషయాలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పవన్‌ కల్యాణ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేయడంలో తప్పేముంది?: “నేను మొన్ననే తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చాను. అక్కడ కర్నాటకతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల నేతలు వచ్చి ప్రచారం చేశారు. కర్నాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ కూడా ఉంది. గతంలో బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ అని చెప్పి ఏపీలో కూడా ఆఫీస్ పెట్టారు. విస్తరిస్తాం అన్నారు. మరి అప్పుడు లేని అభ్యంతరం, ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలో ఎందుకు వస్తోందో నాకైతే అర్థం కావడం లేదు” అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.

- Advertisement -

Also Read: PM Modi-Trump: త్వరలో ప్రధాని మోదీ ట్రంప్‌ భేటీ.. ఈ అంశాలపై చర్చించే ఛాన్స్‌?

బీఆర్‌ఎస్‌ ఏపీలో ఆఫీస్‌ ఓపెన్‌ చేస్తే తప్పులేదా?

మన తెలుగువాళ్లు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాలేదని చంద్రబాబు గుర్తుచేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో కూడా తెలుగువారు పెద్ద పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్నారని, అక్కడ ఉండే రూల్స్ ప్రకారం పని చేస్తూ లీడర్లుగా ఎదుగుతున్నారని చెప్పారు. ప్రజలకు ఎవరు మంచి సేవలు చేస్తే వాళ్లే నాయకులు అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఇక, రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అయిపోయిందని, రెండు రాష్ట్రాలు విడిపోయి ఇరు రాష్ట్రాలు అభివృద్ది చెందుతున్న క్రమంలో మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు చెలరేగడం విశాదకరమన్నారు. ఇప్పుడు తెలంగాణలోని కొందరు నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడి లేనిపోని సమస్యలు, విద్వేషాలు సృష్టిస్తున్నారని, ఎవరి ప్రాంతం ఏంటో, ఎవరు ఎలాంటి వాళ్లో ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. నాయకులు ఎవరైనా ప్రజా చైతన్యంలో, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలి కానీ, ఇలాంటి అనవసరమైన విషయాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Also Read: University of Hyderabad: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఖాళీలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలకన్

చంద్రబాబు వైపుకు ఇష్యూ టర్న్‌..

కాగా, పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు ఈ స్థాయిలో మద్దతుగా నిలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని కోరుకునే సమయంలో, కొందరు నేతలు పాత విషయాలను లాగి రాజకీయం చేయడాన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరిణామంతో ఇప్పటి వరకు పవన్‌ కల్యాణ్ వరకే పరిమితమైన తెలంగాణ నేతల విమర్శలు.. చంద్రబాబు వైపుకు మళ్లే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News