HomeతెలంగాణAshwini Vaishnav: కాజీపేటలో వచ్చే ఐదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ.. అశ్వినీ వైష్ణవ్‌ కీలక...

Ashwini Vaishnav: కాజీపేటలో వచ్చే ఐదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ.. అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన

Ashwini Vaishnav on Kazipet manufacture unit: తెలంగాణలోని కాజీపేట రైల్వే ఫాక్టరీపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్‌ దాదాపు పూర్తి కావొచ్చిందని, త్వరలో అక్కడ ఇంటర్‌ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై అశ్వినీ వైష్ణవ్‌ కీలక సమీక్ష నిర్వహించారు. రానున్న ఐదేళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేస్తుందన్నారు. వీటిని దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగించనున్నట్లు రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ‘‘కొత్తగా అందుబాటులోకి వచ్చే ఇంటర్‌ సిటీ రైళ్లు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్‌తో రూపుదిద్దుకుంటున్నాయి. కొత్తగా తయారయ్యే ప్రతి రైలులో 20 కోచ్‌లు ఉంటాయి. ఇవి సురక్షితమైన కోచ్ డిజైన్, అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకోనున్నాయి. ఈ రైళ్లను గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తాం. వీటిలో రీజనరేటివ్ బ్రేకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. రైలు బ్రేకులు వేసినప్పుడు అది విద్యుత్ జనరేటర్‌గా మారి, పునరుత్పత్తి అయిన విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌లోకి పంపే అధునాతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్నాం.’’ అని అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు.

- Advertisement -

Also Read: Telangana CM: అన్ని పథకాలకు ఒకే డిజిటల్‌ కార్డు.. తెలంగాణ ప్రభుత్వ వినూత్న ఆలోచన..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News