HomeతెలంగాణIndiramma Towers : ‘ఇందిరమ్మ’ దరఖాస్తులకు 20 వరకు గడువు 

Indiramma Towers : ‘ఇందిరమ్మ’ దరఖాస్తులకు 20 వరకు గడువు 

హైదరాబాద్‌, సెప్టెంబర్ 15(తెలుగుప్రభ) : హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్‌) పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబరు 20 వరకు పొడిగించారు. వరుస సెలవుల నేపథ్యంలో గడువు పెంచాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వైస్‌ఛైర్మన్‌, హౌసింగ్‌ కమిషనర్‌ వీపీ గౌతమ్‌ తెలిపారు.
చాంద్రాయణగుట్ట, ఎల్‌బీనగర్‌, ముషీరాబాద్‌, గోషామహల్‌ నియోజకవర్గాల పరిధిలో నిర్మించనున్న టవర్స్‌లోని ఇళ్ల కోసం ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గౌతమ్‌ కోరారు. పథకం అర్హతలు, ఇతర నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించి, లాటరీ ద్వారా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. కాల్‌ సెంటర్‌ 040-24603572కు ఫోన్‌ చేసి సమాచారం పొందవచ్చు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News