HomeTop StoriesBakrid holiday: బక్రీద్ సెలవు దినంలో మార్పు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

Bakrid holiday: బక్రీద్ సెలవు దినంలో మార్పు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

Bakrid holiday change in Telangana: తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ పండగ సెలవుదినాన్ని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాత క్యాలెండర్ ప్రకారం మే 27 (బుధవారం) ఇవ్వాల్సిన బక్రీద్ సెలవును మే 28 (గురువారం) నాటికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 (N.I. Act) ప్రకారం, బక్రీద్‌ పర్వదినం మే 28వ తేదీని సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు ఈ మార్పు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: KTR: సీఏలు పన్నుల లెక్కలకే పరిమితం కావొద్దు.. ఐసీఏఐ స్నాతకోత్సవంలో కేటీఆర్‌ సూచనలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News